మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు. ఉభయ రాష్ట్రాలకు, తెలుగు ప్రజలకు రోశయ్యలేని లోటు తీరనిదని కిషన్ రెడ్డి అన్నారు. 1980లో శాసన మండలి సభ్యుడిగా ఉన్న సమయంలో తాను రెగ్యులర్గా శాసనమండలిలో రోశయ్య ప్రసంగాలు వీక్షించే వాడినని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు శాసనసభలో కలిసి పనిచేశామని, ప్రతిరోజు రాజకీయంగా ఘర్షణ పడేవాళ్లమని, తాము రాజకీయ శతృవులము కాదని, తమకు రాజకీయ వైరుధ్యము మాత్రమే ఉందని తెలిపారు.…
ప్రముఖ కవి సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన నాకు ఎంతో ఆత్మీయులు అని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సిరివెన్నెల సినిమా తన ఇంటి పేరుగా మార్చింది. సిరివెన్నెల లోని పాటలు తెలుగు సినిమా చరిత్రలో తెలుగు ప్రజలకు గుర్తుండిపోయే పాటలు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తన గేయాల ద్వారా దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారి గొప్పతనాన్ని…
వరి విషయంలో బీజేపీ-టీఆర్ఎస్ పార్టీల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా వుంది. రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోసగించే ప్రయత్నం చేస్తోంది తప్ప రాష్ట్రానికి మేలు చేయడం లేదన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో మీడియాతో మాట్లాడారు. వాళ్ళ ప్రెస్ మీట్ లో చెప్పిందే చెప్పారు తప్ప కొత్తగా ఏంలేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భాష గురించి చెప్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ…
తెలంగాణ కేబినేట్ భేటిలో వరి ధాన్యం అంశంపై చర్చించిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంప్రభుత్వం రాష్ర్ట బీజేపీ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఏడేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఏం ఉద్ధరించిందో చెప్పాలన్నారు. బీజేపీ హయాంలో రెండేళ్లలో భయంకరంగా పేదరికం పెరిగింది. రైతులు బాగుపడాలంటే బీజేపీని పారద్రోలాలని అన్నారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలకు ఏం చేసిందో చెప్పాలన్నారు. రైతుల మెడ మీద కత్తిపెట్టి బోర్ల దగ్గర మీటర్ పెట్టాలని ఒత్తిడి చేస్తుంది.…
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని కేసీఆర్ ఎండగట్టారు. కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. 700 మందిని పొట్టనపెట్టుకున్న హంతక పార్టీ బీజేపీ అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్రాన్ని ఒప్పించే దమ్ములేక తెలంగాణ బీజేపీ నేతలు నాటకాలు ఆడుతున్నారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి సిపాయిలా పోరాడి కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయించాలంటూ సవాల్ విసిరారు. బీజేపీ హయాంలో అన్నపురాశులు ఒకవైపు.. ఆకలి కేకలు ఇంకోవైపుగా పరిస్థితి ఉందని ఆయన…
టీఆర్ఎస్ తీరు వల్లే రైతులకు కష్టాలు.. వస్తున్నాయని కానీ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనదని ఎక్కడ చెప్పలేదన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ… హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలతో టీర్ఎస్ బెంబెలేత్తి పోతుంది.ఈ సీజన్లో చివరి బస్తాను కేంద్రం కొంటుందని చెప్పారు. టీర్ఎస్ లేని సమస్యలు సృష్టిస్తుంది. ధాన్యం సేకరణ అసలు సమస్యే లేదు. ఉప్పుడు బియ్యం తీసుకోమని చాలా ఏళ్ళ కిందే కేంద్రం స్పష్టం చేసింది. రా రైస్ వచ్చే విధంగా…
కేసీఆర్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ వేశారు. బాధ్యత గల ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ వ్యవహరించాలి. రైతులకు మేలు జరిగేలా వ్యవహరించాలన్నారు కిషన్ రెడ్డి. కేంద్రం దగ్గర ధాన్యం సేకరణ పాలసీ వుంది. దేశంలో బాయిలర్ రైస్ వాడడం లేదు. తెలంగాణలో ఎవరూ తినడం లేదు. ఏ రైస్ తినాలో ప్రజలపై వత్తిడి తీసుకురాలేం. ఆహార భద్రత కింద 80 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నాం అన్నారు కిషన్ రెడ్డి.
సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తే హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని… మెట్రో రైల్ విషయం లో గతంలోనే చేసుకున్న ఒప్పందాల కు విరుద్ధంగా ఎల్ అండ్ టీ వ్యవహరించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు మోడీ ఫొటో పెట్టక పోవడానికి కారణం రాజకీయాలేనని… రెండేళ్ల కదా ఈ(కేసీఆర్) ప్రభుత్వం ఉండేదని వెల్లడించారు. హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధి కోసం…
వ్యాపారరంగంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా నిత్యం అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ఆనంద్ మహీంద్రా. ఆసక్తి కరమైన విషయాలను, వింతలు, విశేషాలను ఆయను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంటుంటారు. ఇప్పుడు భూమండలంలో తొలి బీచ్కు సంబంధించిన విషయాలను ట్విట్టర్ ద్వారా ఆయన తెలియజేశారు. భూమండలం మొత్తం నీటితో నిండిపోయిన తరువాత, భూమి లోపలి టెక్టానిక్ ప్లేట్లలో కదలిక, భూమి అంతర్భాగంలో ఏర్పడిన పేలుళ్ల కారణంగా మొదటిసారి భూమి నీటి నుంచి కొంత…
టూరిజానికి సంబంధించి ప్రత్యేక పాలసీ లేదు.త్వరలోనే సమగ్రమైన పాలసీని తీసుకువస్తామని… ప్రకటన చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దీన్ని ఒక పరిశ్రమగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో టెంపుల్ టూరిజంకి మంచి అవకాశాలున్నాయని… ఇప్పటికే శ్రీశైలం సింహాచలం త్వరలోనే అన్నవరం, ప్రసాదం స్కీం కింద నిధులు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. మహాయాన బుద్ధిష్ట్ సర్క్యూట్ ని అభివృద్ధి చేస్తామన్నారు. కాకినాడ, నెల్లూరులో, బీచ్ కోస్టల్ కారిడార్ అభివృద్ధి చేస్తామని… కేంద్ర పర్యాటక శాఖ…