తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు.. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి 4వ బహిరంగ లేఖ రాశారు. విభజించి పాలించే బ్రిటిషర్ల పాలనా విధానాన్ని మీరు చాలా చక్కగా ఆకళింపు చేసుకుని పాటిస్తున్నారని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కాకుండా.. మీ ఆలోచనలు, మీ నాయకుల స్వలాభం కోసం జిల్లాల విభజన జరగడం.. దీనికి మంచి ఉదాహరణ అని తెలిపారు. రాష్ట్రంలో జిల్లాల విభజన జరుగుతుంటే ఒక ప్రజాప్రతినిధి పక్క జిల్లాలోని…