లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇతర పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆరూరి పార్టీ వీడకుండా.. బీఆర్ఎస్ సీనియర్ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నిన్న బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.…