మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్ తో 15 నెలలుగా రైతులు చేస్తున్న ఆందోళనకు నేటితో ముగుస్తోంది. పోరుబాటను వీడి పొలం బాట పట్టనున్నారు రైతులు. ఢిల్లీలోని సింఘు, తిక్రీ ఘాజీపూర్ సరిహద్దుల్లో గుడారాల్లో ఉంటూ ఆందోళన చేసిన రైతులు పంజాబ్, హర్యానాలోని తమ తమ గ్రామాలకు విజయ యాత్రతో తిరిగి వెళ్తున్నారు. ట్రాక్టర్లపై ఇళ్ళకు వెళ్తున్న రైతులకు స్వాగతం పలికేందుకు హైవేల వెంబడి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయయాత్ర ను ముందుగా నిన్ననే నిర్వహించాలని…
ఢిల్లీ పోలీసులు ఘాజీపూర్, తిక్రీ సరిహద్దులలోని నిరసన ప్రదేశాల నుండి బారికేడ్లను తొలగించిన తరువాత, రైతులను అక్కడి నుండి పంపిచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వెలుపల దీపావళి చేసుకుంటారని రైతు సంఘాల నాయకుడు గుర్నామ్ సింగ్ చదుని ఆదివారం హెచ్చరించారు. గురు, శుక్రవారాల్లో ఢిల్లీ పోలీసులు ఘాజీపూర్, తిక్రీ సరిహద్దుల్లో రైతుల నిరసన స్థలాల నుండి బారికేడ్లు, ముళ్ల వైర్లను తొలగించారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న…