Operation Sindoor: పాకిస్తాన్‌పై భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’పై ఈ రోజు పార్లమెంట్‌లో చర్చ జరగబోతోంది. చర్చకు అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. దీనిపై కేంద్రం తరుపున మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్, అమిత్ షా మాట్లాడుతారని తెలుస్తోంది. సోమవారం లోక్‌సభలో, మంగళవారం రాజ్యసభలో చర్చ జరుగుతుంది.