టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్‌డమ్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. కాగా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రచారంలో భాగంగా ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ నుండి అద్భుతమైన స్పందన లభించగా తాజాగా ఈ…