టమోటా.. పేరు చెబితే అంతా హడలిపోతున్నారు. ఒకప్పుడు రోడ్డుమీద పారబోసిన టమోటా ఇప్పుడు ఠారెత్తిస్తోంది. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్ యార్డులో టమోటా ధరలకు రెక్కలు. గరిష్ఠంగా ధర కిలో రూ.130 పలకగా.. కనిష్టంగా ధర కిలో రూ.20పలికింది. ఉదయం కిలో టమోటా 104 రూపాయలకు అమ్మడయింది. టమోటా ధరలు చూసి అటువైపు వెళ్ళడానికే వినియోగదారులు జంకుతున్నారు. కూరల్లో టమోటాను నిషేధించారు. సాంబారు, టమోటా చట్నీకి రాం రాం చెప్పారు. టమోటా చట్నీ కావాలంటే అదనంగా చెల్లించాలని…