కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. అత్యంత క్రూరంగా వైద్యురాలు హత్యాచారానికి గురైంది. పోస్టుమార్టం రిపోర్టు కళ్లు బైర్లు కమ్మేలా ఉంది. అంత హింసాత్మకంగా వైద్యురాలిపై దాడి జరిగింది. ఇక ఘటనాస్థలిలో బాధితురాలు అర్ధనగ్నంగా పడి ఉండడం.. దేహమంతా గాయాలై.. రక్తసిక్తంగా శవమై పడి ఉంది.