కన్నడ స్టార్ హీరో కిచ్చాసుదీప్ తల్లి సరోజా సంజీవ్ ఆదివారం కన్నుమూశారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె మరణంపై కిచ్చా సుదీప్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇన్ని రోజులూ మనిషి రూపంలో నా పక్కన తిరిగిన దేవత మా అమ్మ, నాకు తొలి గురువు. నా తొలి అభిమాని. నేను ఎలా నటించినా ఇష్టపడేది. ఇప్పుడు ఆమె ఓ అందమైన జ్ఞాపకం మాత్రమే అంటూ ఎమోషనల్ అయ్యరు.…