రామ్‌చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు దీనిని నిర్మిస్తున్నారు. పొలిటికల్, యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతోంది. అయితే.. ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి పండుగా సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాపై చిత్రయూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్య్వూలో ప్రముఖ నటుడు ఎస్ జే సూర్య ఈ సినిమా గురించి మాట్లాడాడు.…