బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయంపై కొంతమంది దుండగులు దాడులు చేసి విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పరిస్థితులు చేజారిపోకుండా ఉండేందుకు అధికారులు ఆ ప్రాంతంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దేవాలయంపై దాడికి పాల్పడిన వారిగా అనుమానిస్తున్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లోని ఖుల్నా జిల్లాలో చోటుచేసుకుంది. గత శుక్రవారం రోజున స్థానికుల మధ్య గొడవ జరిగిందని, ఆ తరువాతే దేవాలయంపై దాడులు జరిగాయని స్థానికుల…