Union Budget 2024 For Sports: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను మంగళవారం లోక్‌సభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో క్రీడా రంగానికి రూ.3,442.32 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే.. ఈసారి క్రీడలకు 45.36 కోట్లు అదనంగా కేటాయించారు. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఖేలో ఇండియా’కు అత్యధికంగా రూ.900 కోట్లు కేటాయించారు. ఖేలో ఇండియాకు గతంలో కంటే రూ.20 కోట్లు పెంచారు. కేంద్ర…