ప్రస్తుతం అఫ్గన్ లో జరుగుతున్న పరిణామాలు భారత్ కు ఇబ్బందికరంగా మారుతున్నాయా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. భారత్ ముందు నుంచి ఊహించినట్లుగానే అప్ఘన్ కేంద్రంగా ఇండియా వ్యతిరేక ఉగ్రవాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కశ్మీర్ పై అఫ్ఘన్లు మాటమార్చడం.. తమ మిత్రదేశంగా పాకిస్థాన్, చైనాను మాత్రమే ప్రకటించడం చూస్తుంటే ఇవన్నీ కూడా భారత్ కు రాబోయే రోజుల్లో ఇబ్బందులు కలిగించే అంశాలుగా మారబోతున్నాయి. ఉగ్రవాదంపై తొలి నుంచి పోరాడుతున్న భారత్ కు తాలిబన్లు కంట్లో నలుసుగా…