మహిళను తొలగించి వస్తావా.. ఇన్ని రోజులు కేటీఆర్ తన దోస్తు కోసం అభివృద్ధి చేయలేదు అని ఎమ్మెల్యే రేఖానాయక్ ఆరోపించారు. నేను పార్టీలో ఉండను.. మహిళలకు బీఆర్ఎస్ లో చోటులేదు.. రాజీనామా చేస్తున్నాను అంటూ ఆమె వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వంపై ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ విమర్శలు గుప్పించారు. ఏసీడీపీ నిధులు ఆపారు.. అభివృద్ది ఆపడం ఏంటీ అంటూ ఆమె ప్రశ్నించారు. దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, రోడ్ల పనులు ఆపారు.. నిధులు రాకుండా నిలిపి వేశారు అని ఎమ్మెల్యే అడిగారు.