Montha Cyclone: తెలంగాణకు అతి సమీపంలో మొంథా తుఫాన్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.. ఉత్తర వాయువ్య దిశగా తెలంగాణ వైపు తుఫాన్ కదులుతుందని వెల్లడించింది.. మధ్యాహ్నంలోపు ఉమ్మడి ఖమ్మం జిల్లాను తాకనుంది మొంథా.. రాబోయే 6-12 గంటల్లో వాయుగుండంగా లేదా తీవ్ర వాయుగుండంగా మారనుంది. వాయుగుండంగా మారుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం పడుతుంది..