Hyderabad: హైదరాబాదులో భారీగా వర్షపాతం నమోదైంది. ఖాజాగూడలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎస్సార్ నగర్ లో 11 సెంటీమీటర్లు, సరూర్నగర్ లో 10, ఖైరతాబాద్ లో 11 సెంటీమీటర్లు వర్షం కురిసింది. నిమ్స్ ఆస్పత్రి వద్ద వరద నీరు భారీగా నిలిచిపోయింది. పంజాగుట్ట, ఖైరతాబాద్ వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.