టీడీపీకి, కార్పోరేటర్ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత. తనకు కార్పొరేటర్ పదవి వచ్చేలా సహకరించినందుకు ముందుగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంటికెళ్లి కృతజ్ఞతలు తెలపనున్న శ్వేత.. ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయనున్నారు.. ఇక, కార్పోరేటర్ పదవికి రాజీనామా అనంతరం తెలుగుదేశం పార్టీకీ రాజీనామా చేయనున్నారట శ్వేత.
బెజవాడ కార్పోరేషన్ పనితీరుపై విపక్ష టీడీపీ నిరసన తెలుపుతోంది. విజయవాడ నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశం సందర్భంగా కౌన్సిల్ హాల్ కి నిరసన తెలుపుతూ వెళ్లారు టీడీపీ కార్పొరేటర్లు. విజయవాడ నగర పాలక సంస్థ మున్సిపల్ చట్టానికి వ్యతిరేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వైసీపీ పాలకపక్షంపై కార్పోరేటర్ కేశినేని శ్వేత మండిపడ్డారు. ఈ బడ్జెట్ నగర ప్రజలకు గుదిబండగా మారబోతుందన్నారు. గత మూడు సంవత్సరాలు నుండి నగరంలో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యం. గత సంవత్సర కాలం…