Kerala Man Wins ₹ 70 Lakh Lottery: కేరళలో ఓ చేపల వ్యాపారికి భారీ లాటరీ తగిలింది. అక్టోబర్ 12ను అతను తన జీవితాంతం మరిచిపోలేడు. ఏకంగా రూ. 70 లక్షల లాటరీని గెలుచుకున్నాడు. అప్పుల బాధతో ఉన్న అతనిని లక్ష్మీ దేవి కరుణించింది. ఇందులో విశేషం ఏమిటంటే.. అతను తీసుకున్న అప్పు చెల్లించాలని బ్యాంకు నోటీసులు అందిన కొన్ని గంటల్లోనే అతను భారీ లాటరీని గెలుచుకున్నాడు.