కెన్యాలో డ్యామ్ తెగిన ఘటనలో 42 మంది మృతి చెందారు. పలువురు బురదలో కూరుకుపోయారు. వారి కోసం అధికారులు గాలిస్తున్నారు. కాగా.. కెన్యాలో కొన్ని రోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో.. ఓ డ్యామ్ తెగిపోయి అక్కడి జనాన్ని అతలాకుతలం చేసింది. నకురు కౌంటీలోని మాయి మహియు పట్టణ సమీపంలోని డ్యామ్ లో నీటి ఒత్తిడికి కట్ట తెగిపోయింది. ఆ నీరంతా సమీపంలోని ఊళ్లను ముంచెత్తింది. దీంతో పెద్ద సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోగా.. రోడ్లు…
25 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రముఖ టెక్నాలజీ కంపెనీ నోకియా సబ్-బ్రాండ్ గా HMD మార్కెట్ లోకి ప్రవేశించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా కెన్యాలో కంపెనీ HMD పల్స్ సిరీస్ ఫోన్ లను విడుదల చేసింది. అదనంగా., నోకియా 225 కూడా 4Gతో వస్తుంది. నోకియా 3210 త్వరలో లాంచ్ అవుతుందని కూడా ప్రకటించారు. ఈ 2 ఫోన్స్ పల్స్ సరీస్ కు సిరీస్ కంటే భిన్నంగా ఉంటాయి. దీని గురించిన సమాచారం Nokiamob…
Kelvin Kiptum Dead in Car Accident in Kenya: అథ్లెటిక్స్ ప్రపంచంలో విషాదం నెలకొంది. కెన్యాకు చెందిన మారథాన్ స్టార్ అథ్లెట్ కెల్విన్ కిప్టుమ్ ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతడితో పాటు కోచ్ గెర్వైస్ హకిజిమానా కూడా మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరొక మహిళకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. అతి వేగం కారణంగానే కిప్టుమ్ కారు అదుపు తప్పి బోల్తా కొట్టిందని అధికారులు తెలిపారు. ఎంతో భవిష్యత్ ఉన్న కిప్టుమ్..…
కెన్యా రాజధాని నైరోబీలో నిన్న అర్థరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ భారీ పేలుడులో 165 మంది గాయపడినట్లు తెలుస్తుంది. ఈ పేలుడు శబ్ధం చాలా పెద్దగా రావడంతో చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
Kenya: ఆఫ్రికా దేశం కెన్యాను మాయదారి రోగం కలవరపెడుతోంది. అసలు ఏ వ్యాధి కారణంగా బాలికలు అనారోగ్యానికి గురవుతున్నారో వైద్యులకు స్పష్టంగా తెలియడం లేదు. కెన్యాలోని దాదాపుగా 100 మంది పాఠశాల బాలికలు ఆస్పత్రిలో చేరారు. అధికారులు వారి రక్తం, మూత్రం, మలం నమూనాలను నైరోబిలోని ప్రయోగశాలకు పంపారు.
ఆఫ్రికా దేశమైన కెన్యాలో కరెంటు కోతతో దేశం మొత్తం అతలాకుతలమైంది. కెన్యాలో శుక్రవారం రాత్రి విద్యుత్ నిలిచిపోయింది. ఏకంగా 14 గంటల పాటు కరెంటు కటకట ఏర్పడింది. ఇటీవలి సంవత్సరాలలో దేశంలోనే అత్యధిక విద్యుత్ కోత ఇదేనని ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ పంపిణీ సంస్థ తెలిపింది.
48 Killed in Road Accident In Kenya: కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ట్రక్కు అదుపు తప్పి ఇతర వాహనాలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 48 మంది చనిపోయారు. మరోవైపు పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గాయాలు అయిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కెన్యా అధ్యక్షుడు విలియం రూటో సంతాపం వ్యక్తం చేశారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం…
Cyber Fraud: మహారాష్ట్ర థానే నగరానికి చెందిన ఓ వ్యక్తి తన పర్యటనకు సంబంధించిన టికెట్ క్యాన్సలేషన్ తర్వాత రీఫండ్ కోసం గూగుల్ సెర్చ్ చేశారు. అయితే ఆ తరువాత దాదాపుగా రూ. 5 లక్షలు సైబర్ మోసంలో కోల్పోయాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బాధితుడు, అతని స్నేహితుడు కెన్యాలోని మొసాంబా నగారాన్ని సందర్శించాలనుకున్నారు. అయితే దీని కోసం కెన్యా రాజధాని నైరోబీ నుంచి రిటర్న్ టి
ఒక విచిత్రమైన సంఘటనలో 25 ఏళ్ల మగ కెన్యా చెస్ ప్లేయర్ మహిళల ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో ఆడటానికి మహిళల వేషధారణలో వచ్చాడు. కెన్యా రాజధాని నైరోబీలో జరిగిన కెన్యా ఓపెన్ చెస్ ఛాంపియన్ షిప్‌లో ఈ విచిత్రమైన సంఘటన జరిగింది. బుర్కా ధరించి ఆయన మహిళా చెస్ టోర్నమెంట్‌లో ప్రవేశించాడు.