ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులకో శుభవార్త! అతి త్వరలోనే మహేశ్ లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ షూటింగ్ కు చిత్ర బృందం గుమ్మడికాయ కొట్టేయబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక్క పాట చిత్రీకరణ మినహా మొత్తం షూటింగ్ పూర్తయిపోయింది. ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మహేశ్ బాబు సరసన తొలిసారి కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. పరశురామ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో ఎన్నడూ చూడని మహేశ్ ను…