Keerthy Suresh: కీర్తి సురేష్ అంటే మహానటి సినిమా తప్ప మరో సినిమా గుర్తుకు రాదు అంటే అతిశయోక్తి కాదు. మహానటి సావిత్రి బయోపిక్ లో ఆమె నటించింది అనడం కన్నా సావిత్రిలా జీవించింది అని చెప్పొచ్చు. ఏ ముహూర్తాన కీర్తి ఆ సినిమా చేసిందో కానీ ఆ సినిమా తరువాత అంతటి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.
దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో కీర్తి సురేష్ ఒకరు. జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూస్తుంటే కీర్తి ఏదో షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వచ్చినట్టు కన్పిస్తోంది. ఎర్రని చీరలో కీర్తి సురేష్ క్లాసిక్ ఎథెనిక్ లుక్ లో మెరిసి చర్చనీయాంశంగా మారింది. ఈ చీరలో ప్రకాశవంతమైన చిరునవ్వుతో మెరిసిపోతుంది. ఆమె గోల్డెన్ బోర్డర్‌తో ఎరుపు రంగు చీరలో చాలా అందంగా…