ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని కేసీఆర్ ఎండగట్టారు. కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. 700 మందిని పొట్టనపెట్టుకున్న హంతక పార్టీ బీజేపీ అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్రాన్ని ఒప్పించే దమ్ములేక తెలంగాణ బీజేపీ నేతలు నాటకాలు ఆడుతున్నారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి సిపాయిలా పోరాడి కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయించాలంటూ సవాల్ విసిరారు. బీజేపీ హయాంలో అన్నపురాశులు ఒకవైపు.. ఆకలి కేకలు ఇంకోవైపుగా పరిస్థితి ఉందని ఆయన…
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి మీడియాతో మాట్లాడనున్నారు. శనివారం రాత్రి 7 గంటలకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ మాట్లాడే అవకాశముందని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు వరి కొనుగోళ్ల అంశంపైనా కేసీఆర్ మాట్లాడే ఛాన్స్ ఉంది. ఈ ప్రెస్‌మీట్‌లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ప్రగతి భవన్‌లో పలువురు మంత్రులతో కేసీఆర్ ఇప్పటికే…