కట్టండ్రా బ్యానర్లు.... కొట్టండ్రా డీజేలు.... చల్లండ్రా గులాల్ అన్న రేంజ్‌తో అంతా సెట్ చేసి పెట్టుకున్నారట ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాణ. ఇంకేముంది... అయిపోయింది. మనకు మంత్రి పదవి వచ్చేస్తుంది. కాల్ రావడమే ఆలస్యం కారెక్కి హైదరాబాద్ వైపు దూసుకుపోవడమేనని కేడర్‌కు కూడా చెప్పేశారట. సరిగ్గా అక్కడ రాజ్‌భవన్‌లో... కవ్వంపల్లి సత్యనారాయణ అనే నేను అన్న మాట వినపడగానే... నియోజకవర్గంలో దుమ్మురేగిపోవాలంటూ.... అనుచరులకు ఆదేశాలిచ్చేశారట.