Off The Record: శత్రువులు ఎక్కడో ఉండర్రా…. కూతుళ్లు, చెల్లెళ్ళ రూపంలో మారు వేషాల్లో మన కొంపల్లోనే తిరుగుతుంటారన్న పాపులర్ సినిమా డైలాగ్ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పదేపదే గుర్తుకు వస్తోందట. ఎంత సర్దుకుపోదామన్నా…. చెల్లెలు కవిత అస్సలు వదిలిపెట్టం లేదని ఆయనలో అసహనం పెరిగిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. కవిత తాజాగా అన్నను డైరెక్ట్‌గా అటాక్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. పైగా… ఏ విషయంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని బీఆర్‌ఎస్ భావిస్తోందో… అదే…
ఎమ్మెల్సీ కవిత తాజాగా చిట్‌చాట్‌లో మాట్లాడింది. ఏది ఉన్నా తాను సూటిగానే మాట్లాడతానని స్పష్టం చేసింది. వెన్నుపోటు రాజకీయాలు చేయనని. తాను కేసీఆర్ లాగే నేను ఏదైనా సూటిగానే మాట్లాడతానన్నారు. తిక్క తిక్కగానే ఉంటానని తెలిపారు. "పార్టీని నడిపించే సత్తా మీకు లేదు.. నాకు నీతులు చెబుతున్నారా?. వరంగల్ మీటింగ్ సక్సెస్ అయ్యిందని చెప్పుకుంటున్న వాళ్లను చూసి జనం నవ్వుకుంటున్నారు. ఏమైనా ఉంటే.. పార్టీ ఫోరమ్ లోపల మాట్లాడాలి అన్నారు. నేను బయటే మాట్లాడతాను. తెలంగాణ ఏర్పడిన…