నిన్న మొన్నటిదాకా దూకుడుగా ఉన్న ఆ ఎమ్మెల్యే ఉన్నట్టుండి మౌన వ్రతం పట్టారట. అనుచరుల్ని సైతం ష్….గప్‌చుప్ అంటున్నారట. సీఎంని, మాజీ సీఎంని ఓడించిన మొనగాడినంటూ… ఇన్నాళ్ళు రొమ్ము విరుచుకు తిరిగిన ఆ శాసనసభ్యుడు ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారు? వివాదాల జోలికి పోవద్దని అనుచరులకు ఎందుకు చెబుతున్నారు? ఎవరా ఎమ్మెల్యే? ఏంటాయన సైలెన్స్ సంగతులు? అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు రాజకీయ గండరగండుల్ని ఓడించి.. కేవలం తెలంగాణలోనే కాదు… తెలుగు రాజకీయాల్లోనే సంచలనం అయ్యారు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే…