Matka Motion Poster Released: వైవిధ్యమైన చిత్రాలతో అలరిస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన 14వ చిత్రాన్ని ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నట్టు ఈరోజు ఉదయం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ పీరియాడిక్ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న #VT14 సినిమాను హైదరాబాద్‌లో టీమ్, పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో గ్రాండ్‌గా…
VarunTej 14th movie to be directed by Karuna Kumar: మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ ముందు నుంచి తెలుగు హీరోలకు భిన్నంగా కంటెంట్ బేస్డ్ కథలను ఎంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆయన మరో కొత్త కథకు ఓకే చెప్పారని అది ఒక పీరియడ్ క్రైమ్ డ్రామా అని తెలుస్తోంది. ‘పలాస 1978’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన దర్శకుడు కరుణ కుమార్ మొదటి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఆయన ఆ…
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకి ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఆనంది ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. టీజర్, ట్రైలర్ తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా థియేటర్లలోను అలరిస్తోంది. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. గ్రామీణ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో లైటింగ్…
గత యేడాది సెప్టెంబర్ 5న కరోనా ఫస్ట్ వేవ్ తగ్గుముఖం పడుతున్న సమయంలో సుధీర్ బాబు ‘వి’ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. జనవరిలో అది థియేట్రికల్ రిలీజ్ అయినా ప్రతికూల ఫలితమే దక్కింది. ఇక ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. గత యేడాది మార్చిలో వచ్చిన ‘పలాస’ మూవీతో దర్శకుడిగా పరిచయమై, మంచి గుర్తింపు తెచ్చుకున్న కరుణ కుమార్ తెరకెక్కించిన రెండవ…
సుధీర్ బాబు హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. సుధీర్ ను పూర్తి స్థాయిలో మాస్ హీరోగా ప్రొజెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్. 70 ఎమ్.ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు విజయ్ చిల్లా. శశిదేవరెడ్డి. ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వస్తున్న ఈ చిత్రానికి యు.ఎ సర్టిఫికెట్ లభించిందని, తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందని నిర్మాతలు అంటున్నారు. ఆగస్ట్ 27న విడుదల అవుతున్న సందర్బంగా…
యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన “శ్రీదేవి సోడా సెంటర్” ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు ట్రైలర్ ను విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా సక్సెస్ కావాలని కోరారు. ట్రైలర్ చూస్తుంటే ఇది రివేంజ్ డ్రామాలా కన్పిస్తోంది. ఇంతవరకూ టీజర్, పోస్టర్లతో సినిమాను సాఫ్ట్ కార్నర్ లో చూపించిన మేకర్స్ ట్రైలర్ లో మాత్రం డిఫరెంట్ గా మాస్ తో యాక్షన్ ను కూడా చూపించారు.…
సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్, పాటలకు చక్కటి స్పందన లభించింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగిందట.…
యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్”. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లాద్, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పావెల్ నవగీతన్, సత్యం రాజేష్, నరేష్, రఘుబాబు, అజయ్, హర్ష వర్ధన్, సప్తగిరి, కళ్యాణి రాజు, రోహిణి సహాయక పాత్రలు పోషిస్తున్నారు. సమాచారం ప్రకారం సుధీర్ బాబు నటించిన ఈ వైవిధ్యమైన చిత్రం డిజిటల్, శాటిలైట్…