Karimnagar: కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ మండలం రంగపేటలో వడ్ల దొంగతనం కలకలం రేపింది. రంగపేట ఐకేపీ సెంటర్ వద్ద అర్ధరాత్రి ఇద్దరు దొంగలు వడ్ల సంచులు దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. టాటా ఏసీ వాహనంలో సుమారు 20 వడ్ల సంచులు ఎక్కిస్తున్న సమయంలో రైతులు అప్రమత్తమయ్యారు. తక్షణమే అక్కడికెళ్లిన రైతులు దొంగలను అడ్డుకున్నారు. ఆ సమయంలో ఒక దొంగను పట్టుకుని గ్రామస్థులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.