Bandi Sanjay: కరీంనగర్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు మొత్తం రూ.50 కోట్లు విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో కేంద్ర వాటా రూ.40 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో కరీంనగర్ రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని అన్నారు. స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్, అమృత్ తదితర వివిధ కేంద్ర…