kantharao: తెలుగు చిత్రసీమలో అందరి చేత 'గురువుగారూ...' అంటూ పిలిపించుకున్న ఘనత దర్శకరత్న దాసరి నారాయణరావుకే చెందుతుంది. నటరత్న యన్టీఆర్ మరణం తరువాత తెలుగు సినిమా రంగానికి పెద్ద దిక్కుగా తనదైన బాణీ పలికించారు దాసరి.
Kantharao: చిత్రమేమో కానీ, అనేక చిత్రాలలో నటరత్న యన్టీఆర్, నటప్రపూర్ణ కాంతారావు అన్నదమ్ములుగా నటించి అలరించారు. వారిద్దరూ 1923లోనే కొన్ని నెలల తేడాతో జన్మించారు. యన్టీఆర్ శతజయంతి మే 28న మొదలు కాగా, నవంబర్ 16న కాంతారావు శతజయంతి ప్రారంభమవుతోంది.
(మార్చి 22తో ‘కంచుకోట’కు 55 ఏళ్ళు పూర్తి)విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, నటరత్న యన్.టి.రామారావు అత్యధిక జానపద చిత్రాలలో కథానాయకునిగా నటించి అలరించారు. ఆయన నటించిన అనేక జానపదాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక పంపిణీదారులకు, ప్రదర్శనశాలల వారికి యన్టీఆర్ జానపద చిత్రాలే కామధేనువుగా నిలిచాయి. ఆ రోజుల్లో ఏ థియేటర్ లోనైనా సినిమా లేకపోతే, వెంటనే యన్టీఆర్ జానపద చిత్రం వేసుకొనేవారు. సదరు చిత్రాలు రిపీట్ రన్స్ లోనూ విశేషాదరణ చూరగొనేవి. రిపీట్ రన్ లోనూ ఓ జానపద…