Kamal Haasan: యాక్టర్ కమల్ హాసన్ లెటెస్ట్ మూవీ ‘‘థగ్ లైఫ్’’ కర్ణాటకలో వివాదాన్ని ఎదుర్కొంటోంది. ఇటీవల ప్రమోషన్ కార్యక్రమంలో ‘‘కన్నడ తమిళం నుంచి పుట్టింది’’ అంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమల్ హాసన్ క్షమాపణలు చెప్పకుంటే రాష్ట్రంలో సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు.