కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి విరిగిన పాలతో అభిషేకం చేశారు అనేది అవాస్తవం అని ఆలయ ఈవో పెంచుల కిషోర్ చెప్పారు. కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని భక్తులు నమ్మొద్దన్నారు. టెండర్ దారుడు ఇద్దరు భక్తులకు విరిగిన పాలను అందించారని, ఆ ఇద్దరు భక్తులు అతనితో వాద్వాదించుకొని వెళ్లిపోయారని తెలిపారు. ఆ పాలను అభిషేకానికి వినియోగించలేదని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో అర్చకులు పరిశీలించిన అనంతరమే స్వామివారికి అభిషేకం చేపట్టారన్నారు.…