ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వర్గాల మధ్య మొదలైన ఘర్షణ రాష్ట్రంలో పెద్దఎత్తున అల్లర్లకు కారణంగా మారింది. గత రెండు నెలలుగా మైయిటీ, కూకీ తెగల మధ్య ఘర్షణ రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతోంది.