విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు యన్.టి.రామారావు దర్శకత్వంలో ఆయన శ్రీకృష్ణునిగా, దుర్యోధనునిగా ద్విపాత్రాభినయం చేసిన ‘శ్రీక్రిష్ణపాండవీయం’ తెలుగువారిని విశేషంగా అలరించింది. ఇదే చిత్రాన్ని యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలోనే తమిళంలోనూ నిర్మించారు. తొలుత తమిళ చిత్రానికి ‘రాజసూయం’ అనే టైటిల్ ను అనుకున్నారు. తరువాత ‘కన్నన్ కరుణై’ పేరుతో తమిళ ‘శ్రీకృష్ణ పాండవీయం’ రూపొందింది. తెలుగులో ద్విపాత్రాభినయం చేసిన యన్టీఆర్, తమిళంలో కేవలం శ్రీకృష్ణ పాత్రకే పరిమితమై దుర్యోధనునిగా మనోహర్ తో నటింపచేశారు. తమిళవారికి కూడా సుపరిచితమైన చిత్తూరు నాగయ్య, కే.ఆర్.విజయ,…