(మార్చి 22తో ‘కంచుకోట’కు 55 ఏళ్ళు పూర్తి)విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, నటరత్న యన్.టి.రామారావు అత్యధిక జానపద చిత్రాలలో కథానాయకునిగా నటించి అలరించారు. ఆయన నటించిన అనేక జానపదాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక పంపిణీదారులకు, ప్రదర్శనశాలల వారికి యన్టీఆర్ జానపద చిత్రాలే కామధేనువుగా నిలిచాయి. ఆ రోజుల్లో ఏ థియేటర్ లోనైనా సినిమా లేకపోతే, వెంటనే యన్టీఆర్ జానపద చిత్రం వేసుకొనేవారు. సదరు చిత్రాలు రిపీట్ రన్స్ లోనూ విశేషాదరణ చూరగొనేవి. రిపీట్ రన్ లోనూ ఓ జానపద…