Delhi Court : గ్యాంగ్‌స్టర్ సందీప్ అలియాస్ కాలా జాతేడికి పెళ్లి అయిన వెంటనే పెద్ద షాక్ తగిలింది. ఈరోజు అంటే మార్చి 13న ఆయన తన ఇంటికి వెళ్లలేరు. ఢిల్లీలోని ద్వారకా కోర్టు గృహ ప్రవేశం కోసం కాలా జాతేడి కస్టడీ పెరోల్‌ను రద్దు చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ బందోబస్తు మధ్య ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. హర్యానాకు చెందిన సందీప్, రాజస్థాన్‌కు చెందిన అనురాధా చౌదరి.. ఇద్దరూ గ్యాంగ్‌స్టర్లు.. వీరిపై అనేక కేసులున్నాయి.