కూటమి ప్రభుత్వ నేతలు అక్రమ కేసులు పెట్టి వైసీపీ కేడర్‌ని వేధించాలని చూస్తున్నారని వైసీపీ పబ్లిసిటీ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ మండిపడ్డారు. కూటమి నేతలు ఎంత అణిచివేయాలని చూస్తే.. తాము అంత పెద్దగా ఎదుగుతామన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి.. సీఎం చంద్రబాబుకు వెన్నులో వనుకు పుడుతోందన్నారు. రైతుల పరామర్శకు మాజీ సీఎం వైఎస్ జగన్ వెళ్లినప్పుడు వేలాదిగా జనం తరలివచ్చారని కాకుమాను రాజశేఖర్ పేర్కొన్నారు. నేడు అమరావతిలో కాకుమాను…