తెలంగాణలో దాదాపు పదేళ్ల తర్వాత నిర్వహిస్తున్నారు కాకతీయ ఉత్సవాలు. వారంపాటు జరిగే వేడుకలకు కాకతీయ రాజుల వారసులను ఆహ్వానించారు. నాటి కాకతీయ రాజుల చరిత్ర నేటి తరానికి చాటి చెప్పేలా ఏర్పాట్లు చేసినా.. వేడుకల్లో రాజకీయాలు చొచ్చుకొచ్చాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంబురాలను కేవలం ఇద్దరు ముగ్గురు నాయకులకే పరిమితం చేయడం ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్‌లో చర్చగా మారింది. వరంగల్‌లోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకే వేడుకల్ని పరిమితం చేశారని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. రాష్ట్రం మొత్తం…