‘అగ్నిపథ్’పై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. జవాన్లను కోపాద్రిక్తుల్ని చేశాయి. ఆదివారం మీడియాతో మాట్లాడిన కైలాష్.. ‘‘ఒక అగ్నివీర్ సైనిక శిక్షణ పొంది, నాలుగు సంవత్సరాల తర్వాత సేవ నుండి నిష్క్రమిస్తాడు. ఆ సమయంలో అతడు రూ. 11 లక్షలు అందుకోవడంతో పాటు అగ్నివీర్ బ్యాడ్జ్‌ని ధరిస్తాడు. అనంతరం ఇతర విభాగాల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు,…