విలక్షణ దర్శకుడు మిస్కిన్ దర్శకత్వం వహించిన ‘పిశాచి’ తెలుగు, తమిళ భాషల్లో చక్కని విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మిస్కిన్ ‘పిశాచి2’ తో ప్రేక్షకుల ముందుకు మరోసారి వస్తున్నారు. ఇది ‘పిశాచి’కి సీక్వెల్ కాదు. అయితే అదే జోనర్‌లో తెరకెక్కుతోంది. ‘పిశాచి’ చిత్రంలో కొత్త నటీనటులతో వచ్చింది. అయితే రెండవ ఫ్రాంచైజీలో ఆండ్రియా జెరెమియా, విజయ్ సేతుపతి, సంతోష్ ప్రతాప్, పూర్ణ లాంటి స్టార్స్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘దిల్’ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…