తెలుగు సినిమాకు యన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్ళు అని ప్రతీతి. వారిద్దరూ నటించిన చిత్రాలకు అసోసియేట్ గా పనిచేస్తూనే తాను సినిమా కళను అధ్యయనం చేశానని కె.విశ్వనాథ్ పలు పర్యాయాలు చెప్పుకున్నారు. విజయా సంస్థ యన్టీఆర్ హీరోగా రూపొందించిన “పాతాళభైరవి, పెళ్లిచేసిచూడు, మాయాబజార్, అప్పుచేసి పప్పుకూడు” వంటి చిత్రాలకు కె.విశ్వనాథ్ సౌండ్ విభాగంలో పనిచేశారు. ఇక అన్నపూర్ణ సంస్థలో ఏయన్నార్ నటించిన “తోడికోడళ్ళు, మాంగల్యబలం, డాక్టర్ చక్రవర్తి” చిత్రాలకు ఆదుర్తి దర్శకత్వంలో అక్కినేని నటించిన “మంచి మనసులు,…
“కళ కళ కోసం కాదు… ప్రజాశ్రేయస్సు కోసం…” అన్నారు పెద్దలు. దానికి అనుగుణంగా సాగిన కళాకారులు నిస్సందేహంగా ‘కళ’కోసం తపించిన వారే అని చెప్పాలి. విఖ్యాత దర్శకులు కాశీనాథుని విశ్వనాథ్ అలా ‘కళ కోసం తపించారు’ అందుకే జనం మదిలో ‘కళాతపస్వి’గా నిలిచారు. ఇంతకూ ఆయన తపన ఎలా సాగింది? తొలి నుంచీ తెలుగు చిత్రాలు సంగీతసాహిత్యాలతో సాగుతూ ఉన్నవే! ఇప్పటికీ మన తెలుగు సినిమాలు ‘మ్యూజికల్స్’గానే వస్తున్నాయి. ఆ రోజుల్లో అయితే సంగీతసాహిత్యాలకు మరీ పెద్ద…