Singham: పోలీస్ వ్యవస్థను ఉద్దేశించి బాంబే హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సింగం’ వంటి సినిమాల్లో చూపించిన విధంగా న్యాయ ప్రక్రియను పట్టించుకోకుండా సత్వర న్యాయం అందించే హీరో పోలీసు సమాజానికి హానికరమైన సందేశాన్ని పంపుతున్నాడని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌతమ్ పటేల్ అన్నారు. శుక్రవారం ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ వార్షికోత్సవం, పోలీసు సంస్కరణ దినోత్సవాన్న పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.