మేషం : ఆర్థికంగా ఒక అడుగు ముందుకేస్తారు. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార లావాదేవీలలో లాభసాటిగా ఉంటాయి. పాత రుణాలు తీరుస్తారు. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదాపడతాయి. వృషభం : పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. చిన్ననాటి మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు…