లాక్‌డౌన్ ప్రభావం తెలంగాణపై స్పష్టంగా కనిపిస్తోంది. లాక్‌డౌన్ వల్ల తెలంగాణలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో పగటివేళల్లో లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏప్రిల్, మే నెలల్లో కరోనా ఉధృతంగా ఉండటంతో.. తొలుత నెల రోజులపాటు రాత్రి కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం.. ఆ తర్వాత మే 12 నుంచి 30 వరకు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో కేవలం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే సడలింపు ఇచ్చింది.…