పరువునష్టం కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహల్ గాంధీకి ఉత్తరప్రదేశ్ కోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. జూలై 2వ తేదీన వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాలని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు బుధవారం ఆదేశించింది.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపును పురస్కరించుకుని జులై 3న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో తలమునకలుగా ఉంది. ఈ సభకు ప్రధానమంత్రి మోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారు. చరిత్రలో ఈ సభను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలని బీజేపీ యోచిస్తోంది. సభకు 10 లక్షల మందికిపైగా…