ఏపీలో ఈనెలలోనే మరో పథకం అమలు కానుంది. ఈనెల 13న వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున ఆర్ధిక సహాయం అందనుంది. సొంత వాహనాలు కలిగిన ప్రతి ఒక్కరికీ ఈనెల 13న బ్యాంకు ఖాతాల్లో రూ.10వేలు జమచేస్తామని రవాణాశాఖ కమిషనర్ పి.రాజబాబు వెల్లడించారు. ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ కమ్ ఓనర్‌లకు సీఎం చేతుల మీదుగా ఈ ఆర్ధిక సాయం అందిస్తామని ఆయన తెలిపారు. వాహనాల ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, మరమ్మతుల నిమిత్తం నగదు…