Rayalaseema JAC: మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ చేపట్టిన ఉద్యమం క్రమంగా ఉధృతం అవుతోంది. ఇటీవల విశాఖలో ఉత్తరాంధ్ర జేఏసీ గర్జన నిర్వహించగా.. తాజాగా కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేయాలంటూ రాయలసీమ జేఏసీ భారీగా మిలియన్ మార్చ్ చేపట్టింది. ఈ మేరకు రాజ్ విహార్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టగా.. ఈ ర్యాలీలో వేల సంఖ్యలో విద్యార్థులతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువజన, మహిళా సంఘాల నాయకులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, రాయలసీమ ఉద్యమకారులు, మేధావులు…