KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 లీగ్ దశలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరుగుతున్న 65వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ముగిసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్.. కేకేఆర్ బౌలర్ల అద్భుత ప్రదర్శన, బ్యాక్ టు బ్యాక్ వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయ లక్ష్యం 148 పరుగులుగా నమోదైంది.
మొదట్లో వర్షం కారణంగా మ్యాచ్ కాసేపు ఆగిపోయే సమయానికి 4 వికెట్లకు 57 పరుగులతో కష్టాల్లో పడ్డ ముంబైని మిడిలార్డర్ బ్యాటర్లు ఆదుకునే ప్రయత్నం చేశారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 27 బంతుల్లో 26 పరుగులు చేయగా, తిలక్ వర్మ 32 బంతుల్లో 20 పరుగులు చేసి కాస్త నెమ్మదిగా ఆడారు. అయితే చివర్లో కార్బిన్ బోష్ కేవలం 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ముంబై ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. విల్ జాక్స్ (14), దీపక్ చాహర్ (10) పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్లలో కేమరూన్ గ్రీన్, సౌరభ్ దూబే, కార్తీక్ త్యాగి తలో రెండు వికెట్లు పడగొట్టి ముంబైని కట్టడి చేశారు. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే కేకేఆర్‌కు ఈ 148 పరుగుల ఛేజింగ్ అత్యంత కీలకం కానుంది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
World Protests: ఫ్రాన్స్ నుంచి అమెరికా వరకు.. 8 దేశాల్లో నిరసనల సెగ.. కారణాలివే!
-
PM-VBRY Scheme 2026: తొలిసారి ఉద్యోగం చేసేవారికి రూ.15,000.. రెండో విడత డబ్బుల కోసం ఈ కోర్సు తప్పనిసరి!
-
Jailer 2: జస్ట్ 5 నిమిషాల క్యామియోకి రూ.25 కోట్లా?
-
Ramayana: సహ నిర్మాతగా ఉన్నందుకేనా? రణబీర్‌ను డామినేట్ చేస్తున్న యశ్!
-
JD Vance: వలసల్ని ప్రోత్సహించి అనుభవిస్తున్నారు.. ఫ్రాన్స్ అల్లర్లపై యూఎస్ ఉపాధ్యక్షుడు..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!