ఫార్ములా ఈ- కార్ రేసు వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ క్రమంలో.. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం తెలిపింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించలేదు. ఆమె బెయిల్‌పై మంగళవారం ఈడీ, సీబీఐ వాదనలు ముగిశారు. సోమవారం కవిత తరపున వాదనలు ముగిశాయి. వాదనలు అనంతరం జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెయిల్‌పై తీర్పును రిజర్వ్ చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయితో దాడి కేసులో నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్ పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. నిందితుడు సతీష్ కుమార్ బెయిల్ పిటిషన్స్ పై వాదనలు వినిపించిన న్యాయవాది సలీం.. సతీష్ కుమార్ నిరపరాది, అమాయకుడు అని పోలీసులే ఈ కేసులో అక్రమంగా ఇరికించారన్న న్యాయవాది సలీం వాదించారు.
పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఏపీ స్పీకర్ జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లు పిటిషన్‌ను దాఖలు చేశారు. కాగా.. ఏపీ హైకోర్టులో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లంచ్ మోషన్ పిటిషన్లపై విచారణ జరిగింది.…