Jubilee Hills By-Election Result 2025: రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడనుంది. యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.. 10 రౌండ్లలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు తేలనున్నాయి..
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మూడో రోజు 13 నామినేషన్లు దాఖలు కాగా.. ఇప్పటి వరకు 30 మంది అభ్యర్థులు 35 నామినేషన్లు దాఖలు చేశారు. నియోజకవర్గంలో 3,98,982 మంది ఓటర్లు ఉండగా.. అందులో 2,07,367 మంది పురుషులు, 1,91,530 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ ఉప ఎన్నిక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 89 లక్షల రూపాయలు పట్టుకున్నామని…