జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మూడో రోజు 13 నామినేషన్లు దాఖలు కాగా.. ఇప్పటి వరకు 30 మంది అభ్యర్థులు 35 నామినేషన్లు దాఖలు చేశారు. నియోజకవర్గంలో 3,98,982 మంది ఓటర్లు ఉండగా.. అందులో 2,07,367 మంది పురుషులు, 1,91,530 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ ఉప ఎన్నిక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 89 లక్షల రూపాయలు పట్టుకున్నామని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: నకిలీ మద్యం కేసులో అడ్డంగా దొరికిపోయారు.. చంద్రబాబుకు భయం పట్టుకుంది..!
నామినేషన్ల దాఖలు గడువు అక్టోబర్ 21 వరకు ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వీ కర్ణన్ తెలిపారు. నామినేషన్ పత్రాల పరిశీలన అక్టోబర్ 22న జరుగుతుందని, ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 24 అని వెల్లడించారు. అయితే ఈ ఉప ఎన్నికకు పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుందని అధికారులు వెల్లడించారు. జూన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈరోజు మాగంటి సునీత బీఆర్ఎస్ నుంచి రెండు సెట్లతో నామినేషన్ వేశారు.